Friday, August 14, 2026
Homeమేడ్చల్ జిల్లావిద్యార్థులకు యూనిఫాం, షూస్‌ పంపిణీ

విద్యార్థులకు యూనిఫాం, షూస్‌ పంపిణీ

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు పాఠశాల విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో అలియాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు, షూస్‌ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
యూనిఫాంలు, షూస్‌ అందించడం ద్వారా విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శిరీషా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు మున్సిపాలిటీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రేణుక, అలియాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శిరీషా రెడ్డి, పీడీ సాంబశివరావు, షామీర్‌పేట్‌ ఎంఈఓ కమలాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డి, ఏఏపీసీ చైర్మన్‌ స్వరూప, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!