🔸 గ్యాంగ్ ఆఫ్ వార్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహణ.. ముఖ్య అతిథిగా సాయిపేట శ్రీనివాస్
ఆర్ జె న్యూస్, గుండ్లపోచంపల్లి : 299 డివిజన్ పరిధిలోని మైసమ్మగూడలో గ్యాంగ్ ఆఫ్ వార్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్, 299 డివిజన్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి, గణేష్ మండపంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాంగ్ ఆఫ్ వార్స్ యూత్ సభ్యులు సాయిపేట శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 299 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్, మాధవ్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, సత్యనారాయణ, మహేష్, యూత్ సభ్యులు కన్నా, సుంకరి భాస్కర్, దాది మల్లేష్, సుంకరి మల్లేష్, సుంకరి సందీప్, చింత బబ్లు, విలతి భాగ్యలక్ష్మి తదితరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

