ఆర్ జె న్యూస్ బ్యూరో : సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. బృందావన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
🔸ఘటన వివరాలు :
కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళ బృందావన ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు కడుపులో సిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. సిస్ట్ తొలగింపు కోసం శస్త్రచికిత్స చేస్తుండగా అధిక రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించిందని, దీంతో మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మహిళ మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణం పోయిందంటూ ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని బంధువులు ఆరోపించారు. ఆగ్రహంతో కొందరు ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న తుకారాం గేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మహిళ మృతికి గల కారణాలపై, వైద్యుల నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
