Friday, September 11, 2026
HomeతెలంగాణGHMC108, 102 సేవల పనితీరుపై డీఎంహెచ్‌వో...

108, 102 సేవల పనితీరుపై డీఎంహెచ్‌వో సమీక్ష

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్ మేడ్చల్ :

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు కొత్తగా నియమితులైన జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఆనంద్‌ను 108, 102 అంబులెన్స్ సేవల ప్రోగ్రామ్ మేనేజర్ టి. శ్రీకాంత్, జిల్లా మేనేజర్ డి. తిరుపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూన్ నెలలో జిల్లాలో 108, 102 అంబులెన్స్ సేవల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో 108 బృందం సమర్థవంతంగా పనిచేస్తోందని డీఎంహెచ్‌వో డాక్టర్ ఆనంద్ ప్రశంసించారు.అత్యవసర సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన, 108, 102 సేవల సిబ్బందికి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తరఫున పూర్తి సహకారం, నిరంతర ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!