Friday, November 27, 2026
Homeమేడ్చల్ జిల్లాడంపింగ్‌ యార్డును తక్షణమే తరలించాలి

డంపింగ్‌ యార్డును తక్షణమే తరలించాలి

📰 Generate e-Paper Clip

🔸అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ఆదేశం

🔸దుర్వాసనతో విద్యార్థినులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ వాసులకు ఇబ్బందులు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : డంపింగ్‌ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసనతో విద్యార్థినులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దానిని తక్షణమే తరలించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అధికారులను ఆదేశించారు. సీఎంసీ నిజాంపేట్‌ సర్కిల్‌ పరిధిలోని నిజాంపేట్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ సముదాయాల సమీపంలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 42 గదులతో అన్ని వసతులతో నిర్మిస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో సందర్శించారు. అధికారులతో కలిసి కళాశాల నిర్మాణ పనులు, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాలకు ఆనుకుని ఉన్న డంపింగ్‌ యార్డు కారణంగా తీవ్ర దుర్వాసన వెలువడుతోందని, దీంతో కళాశాలలో చదువుకునే విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇష్రత్‌, సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమీపంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ నివాసితులకూ ఈ సమస్య ఇబ్బందికరంగా మారిందని వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థినుల విద్యాభ్యాసానికి, స్థానిక ప్రజల నివాసాలకు ఇబ్బందిగా మారిన డంపింగ్‌ యార్డును అక్కడి నుంచి వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో ఈడబ్ల్యూఎస్‌ డీఈఈ సంధ్యారాణి, ఏఈ ప్రసాద్‌, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.స్రవంతి, అధ్యాపకులు బి.నూతన, సుచరిత, సీఎంసీ నిజాంపేట్‌ సర్కిల్‌ శానిటేషన్‌ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!