ఆర్.జె.న్యూస్, రాజేంద్రనగర్ : మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేడి నీటి బకెట్లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కుటుంబం ఉపాధి నిమిత్తం మైలార్దేవ్పల్లి పరిధిలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటోంది. చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. గురువారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి స్నానం కోసం బకెట్లో వాటర్ హీటర్ పెట్టి నీళ్లు వేడి చేస్తోంది. అదే సమయంలో ఫోన్ రావడంతో ఆమె బయటికి వెళ్లింది. ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల కుమార్తె మానస ప్రమాదవశాత్తూ వేడి నీటి బకెట్లో పడిపోయింది. తీవ్ర గాయాలైన చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఘటనపై మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
మైలార్దేవ్పల్లి పరిధిలో విషాదం – వేడి నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
RELATED ARTICLES
